![]() |
![]() |
.webp)
జబర్దస్త్ షో ప్రతీ వారం ఆడియన్స్ ని అలరిస్తూనే ఉంది. ఎంతో మంది కమెడియన్స్ కి మంచి లైఫ్ ఇచ్చిన విషయం తెలిసిందే..అలాంటి ఈ షోకి సంబంధించిన ప్రోమో రిలీజ్ అయ్యింది. ఐతే బుల్లితెర మీద కమెడియన్ ఇమ్మానుయేల్, వర్ష లవ్ ట్రాక్ గురించి అందరికీ తెలుసు.. అలాంటి వర్ష ఇమ్మానుయేల్ బిగ్ షాక్ ఇచ్చింది. ఈమె హీరోయిన్ కంటే అందంగా, యాక్టివ్ గా, మంచి జోష్ తో అలరిస్తూ ఉంటుంది. జబర్దస్త్ స్కిట్ల ద్వారా బాగా పాపులర్ అయిపోయింది. ఒకానొక టైంలో వీరు పెళ్లి చేసుకోబోతున్నాం అంటూ ఓపెన్ గా చెప్పడం అది కాస్త సోషల్ మీడియాలో వైరల్ అవడం జరిగింది. వీళ్ళ పెళ్లి ఎప్పుడెప్పుడు జరుగుతుందా అంటూ ఎదురుచూస్తున్న ఆడియన్స్ కి వర్ష షాకిచ్చింది. నెక్స్ట్ వీక్ ప్రోమో చూస్తే అందులో ఇస్మార్ట్ ఇమ్మానుయేల్ టీమ్ లో ఉన్న వర్ష ఇమ్మానుయేల్ ని అన్నా అంటూ పిలిచింది . దీంతో ఇమ్మానుయేల్ కి బాగా కోపం వచ్చేసింది. మర్యాదగా మాట్లాడు అని వార్నింగ్ ఇచ్చాడు. వీళ్ళ స్కిట్ తర్వాత రాకింగ్ రాకేష్- సత్య కలిసి స్కిట్ చేశారు.
"నీకేమన్నా నోటీసు పంపించారా ఇంత అందంతో మత్తెక్కిస్తున్నావ్ కదా" అని రాకేష్ సత్య అందాన్ని పొగిడేసరికి స్టేజి కింద కూర్చున్న రాకేష్ వైఫ్ సుజాత ఫుల్ ఫైర్ అయ్యింది. "నువ్వు స్టేజి దిగి రా నీకు ఇవ్వాల్సిన నోటీసులు నేను ఇస్తా" అంటూ ఒక దుడ్డు కర్ర తీసుకుని సీరియస్ గా రాకేష్ మీదకు విసిరేసింది. ఇక ప్రోమో ఫైనల్ లో బులెట్ భాస్కర్ స్కిట్ లో ఇంద్రజ మీద కౌంటర్ వేసాడు .."అమ్మ ఎప్పుడొస్తది" అని నరేష్ ని అడిగేసరికి "20 న వస్తుంది" అని చెప్పాడు. " ఏ అమ్మ" అని భాస్కర్ రివర్స్ లో అడిగాడు "ఇంద్రజమ్మ" అని చెప్పాడు నరేష్. "మీరు ఆవిడని అమ్మ అని పిలవడం ఏమిటి ఆమె అమ్మాయిలా డాన్స్ చేస్తూ ఉంటే" అని ఫన్నీ కౌంటర్ వేసాడు భాస్కర్.
![]() |
![]() |